![]() |
![]() |

బాలీవుడ్ ఫిల్మ్ 'ధురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టి, ఇప్పటికే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డీల్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
'ధురంధర్' ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.285 కోట్లకు సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వినిపిస్తోంది. గతంలో 'ధురంధర్' ఓటీటీ రైట్స్ రూ.130 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రూ.285 కోట్ల డీల్ తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఈ వార్త నిజమైతే.. ఇండియన్ సినీ హిస్టరీలో ఇదే బిగ్ ఓటీటీ డీల్ అవుతుంది. గతంలో 'పుష్ప-2' రైట్స్ ని రూ.275 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డుని 'ధురంధర్' బ్రేక్ చేసినట్లు అయింది. (Dhurandhar OTT)
ఓటీటీ రిలీజ్ విషయానికొస్తే.. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తరువాతే 'ధురంధర్' స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశముంది. జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.
Also Read: తెలుగునాట అవతార్-3 ప్రభావం.. వంద కోట్లు కష్టమేనా..?
కాగా, 'ధురంధర్'కి సీక్వెల్ కూడా ఉంది. రెండో భాగం 2026 మార్చి 19న విడుదల కానుంది. మరి ఈ రెండు భాగాలకు కలిపి ఓటీటీ డీల్ జరిగిందా? లేక ఒక్క భాగానికే రూ.285 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధపడిందా? అనేది తెలియాల్సి ఉంది.
![]() |
![]() |